రేటింగ్ పేరిట రూ. 2 లక్షలు కాజేశాడు!

రేటింగ్ పేరిట రూ. 2 లక్షలు కాజేశాడు!
  • మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను మోసగించిన సైబర్ ఫ్రాడ్

కోల్​బెల్ట్​,వెలుగు: మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళను నమ్మించి సైబర్ మోసగాడు రూ. లక్షల్లో కాజేశాడు. రామకృష్ణాపూర్​ టౌన్ ఎస్ఐ లింగంపల్లి భూమేశ్​ తెలిపిన మేరకు.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్​కు చెందిన మహిళ వాట్సాప్ కు  కొద్ది నెలల కింద మెసేజ్ ​వచ్చింది. రెస్టారెంట్స్​కు ఫైవ్​స్టార్​ రేటింగ్​ఇస్తూ అధికంగా డబ్బులు సంపాదించవచ్చని అందులో ఉంది. అనంతరం సైబర్​మోసగాడు ఒక టెలిగ్రామ్​ లింక్​ను పంపించాడు.

ఆమెకు కొన్ని టాస్క్​లు ఇచ్చి పూర్తి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పగా..  నమ్మిన ఆమె తొమ్మిది సార్లు రూ.2 లక్షలను ట్రాన్స్ ఫర్ చేసింది. డబ్బులు తిరిగి రాకపోవడం, వాట్సాప్​ నంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది.  మోసపోయానని బాధితురాలు ఆదివారం సైబర్ ​క్రైమ్​ టోల్​ఫ్రీ నంబర్1930కు కాల్ ​చేసి కంప్లయింట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి యాప్స్, వెబ్​సైట్, ఆన్​లైన్​లింక్స్, కాల్స్​కు రిప్లై ఇవ్వొద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ భూమేశ్​ సూచించారు.