సిగరెట్ తాగాడని.. స్టార్ హీరోపై కేసు

సిగరెట్ తాగాడని.. స్టార్ హీరోపై కేసు

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విజయ్ హీరోగా వస్తున్న లియో(Leo) మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. విజయ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కూడా ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

అయితే ఈ సాంగ్ లో విజయ్ సిగరెట్ కాలుస్తూ కనిపించారు. ఇది పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఉందని, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఇక ఇదే విషయంపై పీఎంకే పార్టీ నేత రామదాసు(PMK Ramadasu) స్పందించారు. ఇచ్చిన మాటను విజయ్ దళపతి తప్పాడని కామెంట్ చేశారు. 2012లో విజయ్ తాను నటించే సినిమాల్లో సిగరెట్ తాగే సీన్లలో నటించనని హామీ ఇచ్చారని, కానీ లియో సినిమాలో స్మోకింగ్ సీన్లలో నటించడాన్ని తప్పుబట్టారు రామదాసు. అంతేకాదు.. ఈ సినిమాలో విజయ్ సిగరెట్ తో కనిపించడంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రామదాసు.