నర్సంపేట, వెలుగు : తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్టు ఇచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లోని వేద స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టర్, డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. దుగ్గొండి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ యువతి కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు వెళ్లిందన్నారు.
డాక్టర్ సూచన మేరకు వేద స్కానింగ్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించగా, ప్రెగ్నెన్సీ కన్ఫం అంటూ ఫేక్ రిపోర్టు ఇచ్చారని వాపోయారు. తప్పుడు రిపోర్టుపై స్కానింగ్ సెంటర్లోని డాక్టర్లను నిలదిస్తే తమపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేద స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
