
- ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు విజ్ఞప్తి
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆదివారం ఫిర్యాదు చేశారు. సిటీలో వాణిజ్య సముదాయాల నిర్వహణ, అక్రమ కట్టడాల నియంత్రణ, అగ్నిప్రమాద నివారణ, భద్రత అంశాల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఆయన ఆరోపించారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న బల్దియా సర్కిల్ 9 అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. తన ఫిర్యాదును ఎన్‌ఎహ్‌ఆర్సీ విచారణకు స్వీకరించందని ఆయన వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నింది తులను శిక్షించాలని విజ్ఞప్తి చే శారు.