భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని..మంచిర్యాల కలెక్టర్ పై ఫిర్యాదు చేస్తాం

భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని..మంచిర్యాల కలెక్టర్ పై ఫిర్యాదు చేస్తాం

నస్పూర్, వెలుగు : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని మంచిర్యాల కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని మంచిర్యాల స్వచ్ఛంద పౌర సేవా సంస్థ తెలిపింది. గురువారం నస్పూర్ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 42లో 102 ఎకరాల భూమి ఉండగా 29 ఎకరాలు టీఎన్జీఓలకు కేటాయించామని చెప్పడమే తప్పా ఎలాంటి ఆధారలు చూపడం లేదన్నారు.

ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మిస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఇల్లీగల్ వ్యవహారంతో ఆధికార పార్టీ లీడర్లు లబ్ధి పొందుతున్నారని, ఆ పార్టీకి చెందిన ఓ లీడర్ 2 ఎకరాలు అక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిస్తే ఎటువంటి చర్యలు లేవని ఫైర్​అయ్యారు. సర్వే ఏడీ, నస్పూర్ కమిషనర్, టీపీఓలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్వచ్ఛంద పౌరసేవా సంస్థ ప్రధాన కార్యదర్శి తుల మధుసూదన్, వైస్ ప్రెసిడెంట్ బల్ల శివశంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.