హలో.. బల్దియా.. వాటర్ బోర్డు.. కాల్ చేస్తే స్పందించని అధికారులు

హలో..  బల్దియా.. వాటర్ బోర్డు.. కాల్ చేస్తే స్పందించని అధికారులు

 హైదరాబాద్, వెలుగు: వానల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్‌‌‌‌‌‌‌‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్​) టీమ్స్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  5 రోజుల్లోనే బల్దియాకు 1, 200 ఫిర్యాదులు, వాటర్ బోర్డుకు దాదాపు 1,000 వరకు  ఫిర్యాదులు అందాయి.  ఇందులో అన్ని  క్లోజ్  చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా చోట్ల పనులు చేసినట్లు కనిపించడం లేదు.  ఒక్క డీఆర్ఎఫ్  టీమ్స్​కి వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

 బల్దియా, జలమండలి హెల్ప్ లైన్  నెంబర్లకు వస్తున్న కంప్లయింట్స్​పై పెద్దగా స్పందించడం లేదు.  సమస్యకి పరిష్కారం చూపకుండానే  ఆ ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారని సిటిజన్స్ మండిపడుతున్నారు.  రెండు రోజులుగా వర్షాలు తగ్గినప్పటికీ పనులు చేయడం లేదు.  వాటర్ బోర్డు ట్విట్టర్ కి వస్తున్న ఫిర్యాదుల్లో 70 శాతానికిపైగా సీవరేజీ ఓవర్ ఫ్లోకి సంబంధించినవే ఉంటున్నాయి. జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదులపై ఎక్కువగా రోడ్లు డ్యామేజ్ ఉంటున్నాయి.  ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు చేయడం లేదు.