‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది

‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది
  • ‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది
  • మూడేండ్లలో రెండో సారి
  • రూ.600 కోట్ల పనుల్లో నాణ్యతా లోపాలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవపూర్, వెలుగు:  కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.600 కోట్లతో నిర్మించిన గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం కాళేశ్వరం వద్ద కూలిపోయింది. మొత్తం ప్రాజెక్టుకే నీళ్లు అందించే ఈ కాల్వ మూడేండ్లలో రెండో సారి కూలిపోవడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీ కి నీళ్లు తీసుకెల్లే ప్రధాన కాల్వ లైనింగ్ వరదలకు కూలింది. చాలా చోట్ల పగుళ్లు పడ్డాయి. ప్రాజెక్టు పూర్తయిన తరువాత 18 నెలల లోపే మొదటిసారి కూలిన లైనింగ్ మంగళవారం మరోసారి కూలడం ప్రాజెక్టు నాసిరకం పనులు చేశారనే వాదనకు బలం చేకూరుస్తున్నది. 13.6 కిలోమీటర్ల పొడవైన కాల్వ పలు చోట్ల ఇప్పటికే పగుళ్లుబారగా 6.400 మైలు రాయి వద్ద సుమారు 10 మీటర్ల పొడవున పూర్తీగా కూలిపోయింది. దీనికి తోడు కాల్వకు సమాంతరంగా నిర్మించిన బీటీ రోడ్డు కిలోమీటర్ మేర పూర్తిగా ధ్వంసమైంది.

ప్రశ్నార్థకంగా కాల్వ పరిస్థితి

ఎస్సారెస్పీ కాల్వ కట్టి నలభై ఏండ్లు దాటింది. అయినా ఇప్పటికీ నీటిని చేరవేస్తున్నాయి. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కట్టిన గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడేండ్లకే రెండు సార్లు కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా రోజుకు మూడు టీఎంసీల నీటిని మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అన్నారం బ్యారేజీలోకి పంపించడానికి ఈ కాల్వ నిర్మించారు. నిర్మించిన మూడేండ్లలోనే రెండు కూలడంతో ఈ కాల్వ అస్తిత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

ఇంజనీరింగ్ ఫెల్యూరే

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా ఇంజనీరింగ్ ఫెల్యూర్, కాంట్రాక్టర్ల నాసిరకం పనులే కనబడుతున్నాయి. ఇప్పటికే అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్ లు నీట మునిగిపోవడం, గ్రావిటీ కెనాల్ రైలింగ్ మళ్లీమళ్లీ కూలిపోతుండడమే దీనికి నిదర్శనం. మట్టి లూజుగా ఉన్న చోట దాని గుణానికి సరిపడే విధంగా పనులు చేయాల్సినటువంటి సంస్థలు నాసిరకం పనులతో సరిపెట్టాయి. సరిగ్గా పని చేయకపోవడం వల్ల వందల కోట్లతో కట్టిన గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ ఇలా కూలిపోతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.