టర్కీపై ఇండియా సీరియస్
న్యూయార్క్: టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌పై ఇండియా మండిపడింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో చర్చ సందర్భంగా కాశ్మీర్‌పై ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇండియా అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ‘సౌత్ ఏషియాలో శాంతిని నెలకొల్పాలంటే కీలకమైన కాశ్మీర్ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది’ అని ఎర్డోగన్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఎన్‌లో ఇండియా పార్లమెంట్ ప్రతినిధి అయిన టీఎస్ తిరుమూర్తి దీనిపై ఓ ట్వీట్ చేశారు. ‘ఇండియా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌పై టర్కీ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను గమనించాం. భారత అంతర్గత వ్యవహరాల్లో స్థూల జోక్యం చేసుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడాన్ని టర్కీ నేర్చుకోవాలి. అలాగే తన సొంత పాలసీలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి’ అని తిరుమూర్తి ట్వీట్ చేశారు.
We have seen remarks by President of Turkey on Indian UT of Jammu & Kashmir. They constitute gross interference in India’s internal affairs and are completely unacceptable. Turkey should learn to respect sovereignty of other nations and reflect on its own policies more deeply.
— PR UN Tirumurti (@ambtstirumurti) September 22, 2020
