నేడు(ఆగస్టు 24) కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఓరియంటేషన్..డిజిటల్ లెర్నింగ్, విద్యాప్రమాణాల పెంపుపై దిశానిర్దేశం

నేడు(ఆగస్టు 24) కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఓరియంటేషన్..డిజిటల్ లెర్నింగ్, విద్యాప్రమాణాల పెంపుపై దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్ల కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు విద్యాశాఖ సోమవారం రాష్ట్రస్థాయి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నగరంలోని శిల్పకళా వేదికలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ ప్రోగ్రామ్ జరగనుంది. పీఎం శ్రీ, ఎఫ్ఎల్​ఎన్ అమలు, విద్యా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై1817 మంది కాంప్లెక్స్ హెచ్ఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఈ కార్యక్రమానికి విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేయనుండగా.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కాంప్లెక్స్ హెచ్ఎంల బాధ్యతలపై ప్రసంగించనున్నారు. స్కూళ్లలో డిజిటల్ లెర్నింగ్, ఏఐ వినియోగం, తదితర అంశాలపై ఎక్స్ పర్ట్స్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.