Vastu tips: ఇంటికి.. ప్రహరీగోడ మధ్యలో పాత వస్తువులు స్టోర్ చేయొచ్చా..

Vastu tips: ఇంటికి.. ప్రహరీగోడ మధ్యలో పాత వస్తువులు స్టోర్ చేయొచ్చా..

 వాస్తు ప్రకారం ఇంటికి, ప్రహరీకి మధ్య స్థలం ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో పాత వస్తువులు స్టోర్​ చేస్తే నష్టం ఉంటుందా..  పడమర దిక్కులో  రోడ్డు ఉంటే షట్టర్స్​ ఏర్పాటు చేసుకోవచ్చా.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాధుని శ్రీనివాస్​ సలహాల గురించి తెలుసుకుందాం. . .

ప్రశ్న: ఇంటికి, ప్రహరీకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో రాళ్లు, ఇటుకలు, అలాగే పాత వస్తువులు వంటివి పెట్టుకోవాలనుకుంటే ఏవైపు ఏర్పాటు చేసుకోవాలి?

జవాబు: ప్రహరీకి, ఇంటికి మధ్య నాలుగువైపులా ఖాళీస్థలం ఉంటే, అన్నివైపులా బరువు పెంచకూడదు. కొత్తగా ఏదైనా కట్టుకోవాలన్నా, పాత వస్తువులు పెట్టుకుని బరువు పెంచుకోవాలన్నా దక్షిణ నైరుతి మూలనే వాడుకోవాలి.

ప్రశ్న: పడమరవైపు రోడ్ ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాం. పడమర దిక్కులోనే ఇంటికి రెండు షట్టర్స్ ఏర్పాటు చేసి, ఏదైనా చిన్న బిజినెస్ చేద్దామనుకుంటున్నాం. పడమర వైపు షట్టర్స్ ఏర్పాటు చేసుకోవడం కరెక్టేనా?

జవాబు: ప్రధాన ద్వారం కాకుండా పడమర వైపు షట్టర్స్ ఏర్పాటు చేసుకుని, బిజినెస్ చేసుకోవచ్చు