
చందానగర్, వెలుగు: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్‌పరిధిలోని చందానగర్సర్కిల్లో పన్నుల గోల్మాల్ జరిగింది. రూ.56 లక్షల సూపర్స్ట్రక్చర్పన్నును ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఓ కంప్యూటర్ ఆపరేటర్ సొంత ఖాతాలో వేసుకుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 వరకు జరిగిన ఈ అవినీతి ఆడిటింగ్లో బయటపడింది. చందానగర్సర్కిల్ ఆఫీస్‌లోని సిటిజన్సర్వీస్సెంటర్లో సుభాషిణి అనే మహిళ ఔట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. జీవో 299 ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలకు సూపర్‌స్ట్రక్చర్ పేరిట పన్నులను క్యాష్ రూపంలో సేకరిస్తున్నారు.
ఈ అవకాశాన్ని సుభాషిణి తన స్వలాభం కోసం ఉపయోగించుకుంది. ఇటీవల ఆడిటర్లు సర్కిల్కార్యాలయంలో ఆడిటింగ్‌కు వచ్చారు. 2024 ఏప్రిల్1 నుంచి ఇప్పటి వరకు వరకు సూపర్‌స్ట్రక్చర్ పన్నులకు చెందిన రూ. 56 లక్షలు ప్రభుత్వ అకౌంట్లలో జమ కాలేదని గుర్తించారు. దీనిపై కంప్యూటర్ఆపరేటర్ను ప్రశ్నించగా, చేసిన తప్పును అంగీకరించింది. తన వద్ద ఉన్న లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా ప్రజల నుంచి పన్నులను వసూళు చేసి వారికి రశీదులు ఇచ్చింది.
ఆ తర్వాత డబ్బును ప్రభుత్వ అకౌంట్లలో జమ చేయకుండా దారి మళ్లించింది. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు మాయం అవ్వడంతో అధికారులు కంగుతిన్నారు. దీంతో 2021–-2024 సంవత్సరాలకు చెందిన లెక్కలను కూడా సేకరిస్తున్నారు. ఈ అవినీతిలో అధికారుల పాత్ర ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సర్కిల్ ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడిటింగ్రిపోర్టుతో వచ్చిన తర్వాత సదరు కంప్యూటర్ఆపరేటర్పై చర్యలపై తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సర్కిల్ఉన్నతాధికారి తెలిపారు.