సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూలో ఏబీవీపీ నేతల ఆందోళన

సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూలో ఏబీవీపీ నేతల ఆందోళన

ఓయూ,వెలుగు: ఓయూ పరిధిలో పీజీ సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల వాయిదా కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పీజీ సిలబస్​పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడమేమిటని విద్యార్థులు ప్రశ్నించారు. పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని, లేదంటే బహిష్కరిస్తామని ఏబీవీపీ నేతలు పృథ్వీ, అలివేలు, రాజు హెచ్చరించారు.