ఉద్రిక్తంగా ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన

ఉద్రిక్తంగా ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన

విధుల్లోకి తీసుకోవాలంటూ ఔట్  సోర్సింగ్ నర్సులు చేస్తున్న ఆందోళనలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 20 మంది నర్సులను అరెస్టు చేశారు. ఈ తోపులాటలో ఓ నర్సుకు గాయాలైంది.

తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఔట్  సోర్సింగ్ నర్సులు ఉందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో TPCC అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు శుక్రవారం ర్యాలీగా బయలుదేరారు. దీంతో హైదరాబాద్‌ గాంధీభవన్‌ దగ్గర నర్సుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అది కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో నర్సులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. 20 మంది నర్సులను అరెస్ట్‌ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తోపులాటలో మమత అనే నర్సుకు గాయాలయ్యాయి. నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు మద్దతు తెలిపారు.