సికింద్రాబాద్ కేజీబీవీ ముందు పేరెంట్స్ ఆందోళన

సికింద్రాబాద్ కేజీబీవీ ముందు పేరెంట్స్ ఆందోళన

సికింద్రాబాద్ మారేడ్ పల్లి కస్తూర్బా గాంధీ కళాశాలలో  ప్రాక్టికల్స్ చేస్తుండగా విషవాయువు వెలువడిన ఘటనలో విద్యార్థులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. విషవాయువు పీల్చిన విద్యార్థులు శ్వాసకోశ వ్యాధులతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కళాశాల ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మరోవైపు ఇవాళ శ్వాస ఆడకపోవడంతో క్లాస్ రూమ్ లో పడిపోయిన విద్యార్థులను  టీచర్లు హాస్పిటల్ కు తరలించారు.

ప్రాక్టికల్ చేస్తుండగా గ్యాస్ లీక్

నవంబర్ 18న ఈస్ట్ మారేడ్ పల్లిలోని కస్బూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలోని సైన్స్ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుండగా కెమికల్ గ్యాస్ లీకై 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు  గురయ్యారు. విద్యార్థినులు ఇంటర్​ బ్లాక్‌‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌‌లో  ప్రాక్టికల్స్​చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ గ్యాస్ లీకైంది.  దీంతో ల్యాబ్ లోని 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది స్పృహ తప్పి ల్యాబ్ లోనే పడిపోయారు.