పండించమన్నరు.. కొంటలేరు!

పండించమన్నరు.. కొంటలేరు!

ఎండలో నడిరోడ్డుపై జొన్న రైతుల ఆందోళన 
పిట్లం, వెలుగు: అధికారులు చెప్పిన విధంగా జొన్నలు పండించామని.. తీరా పంట చేతికొచ్చాక సర్కార్​కొనట్లేదని కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం రాంపూర్ రైతులు బుధవారం రోడ్డెక్కారు. పిట్లం – బాన్సువాడ హైవేపై బైaఠాయించి ధర్నాకు దిగారు. పంట చేతికొచ్చి మూడు నెలలవుతోందని చెప్పారు. 150 లారీల జొన్నలు ఊరి చివరన కుప్పలుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్నాయని వాపోయారు. ప్రభుత్వం కొంటుందని ఎదురు చూసి.. చూసి.. చివరకు ఆందోళనకు దిగామని చెప్పారు. కొన్ని కుప్పల కిందకి వాన నీళ్లు చేరడంతో మొలకలు వచ్చాయని కన్నీటి పర్యంతమయ్యారు. రెండు గంటలపాటు ట్రాఫిక్​నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి రైతులతో మాట్లాడారు. బుధవారం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సర్ది చెప్పి పంపించేశారు.