ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హాస్టల్స్ లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై విద్యార్థులు రోడ్లపై బైఠాయించారు సెమిస్టర్ పరీక్షలు పూర్తవడంతో ఈనెల 26 వరకు విద్యార్థులకు హాలిడేస్ ఇచ్చారు ఓయూ అధికారులు. ఈ నెల 16 న గ్రూప్ వన్ పరీక్ష ఉండటంతో విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు.

ఇలాంటి సమయంలో హాస్టల్స్ లో కరెంట్, వాటర్ నిలిపివేసి.. హాస్టల్స్ ఖాళీ చేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వీసీ రవీందర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అప్పటి వరకూ తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు. యూనివర్సిటీ చరిత్రలోనే ఇలాంటి ఏ వీసీని మేము చూడలేదన్నారు విద్యార్థులు.