కల్తీ పెట్రోల్ పోస్తున్నారని ఆందోళన

కల్తీ పెట్రోల్ పోస్తున్నారని ఆందోళన

చైతన్య పురిలో ఘటన

దిల్ సుఖ్ నగర్, వెలుగు: చైతన్యపురిలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ లో ఆయిల్​కొట్టించి కొద్ది దూరంగా వెళ్లగానే వాహనాలు నిలిచి పోయాయి. పెట్రోల్ పై అనుమానం వచ్చిన వాహనదారులు బంక్ వద్దకు వచ్చి ఖాళీ బాటిల్స్ లో నింపమని చెప్పారు. పెట్రోల్​నీళ్ల రంగులో ఉండటంతో వాహనదారులు అవాక్కయ్యారు.

కల్తీపై మాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం తో వాహనదారులు బంక్ వద్ద  ఆందోళన చేపట్టారు. అనంతరం దాదాపు 10 నుంచి 20మంది వాహనదారులు చైతన్య పురి పీఎస్​లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిన్నగౌడ్, ప్రసాద్, రమేష్, షఫీ, అప్పన్న, యశ్వంత్ సాయి, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.