
నిమ్స్ ఆస్పత్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న అకౌంటెంట్లు, క్లర్కులు శుక్రవారం(జులై-17) కోఠి పబ్లిక్ హెల్త్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచకపోతే వచ్చే నెల నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు.
మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలోనూ తమకు సరిగా జీతాలు చెల్లించడం లేదని అక్కడి పారామెడికల్, టెక్నికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలోనూ ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగగా ప్రభుత్వం వారు కోరిన డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో సమ్మె ఆలోచన విరమించి తిరిగి విధుల్లోకి చేరారు.