ఓకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేం

ఓకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేం
  • దశలవారీగా సడలింపులు ఇస్తామన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్ : బ్రిటన్ లో లాక్ డౌన్ ను ఒకేసారి ఎత్తివేయలేమని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లోనే ఇదివరకు ప్రకటించిన లాక్ డౌన్ గడువు ముగియనుంది. ఐతే ఇప్పటికీ బ్రిటన్ లో కరోనా కొత్త కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి లాక్ డౌన్ ను ఎత్తివేయొద్దని బ్రిటన్ నిర్ణయించింది. జూన్ 1 వరకైతే లాక్ డౌన్ కొనసాగుతుందని బ్రిటన్ ప్రధాని తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తామన్నారు. జూన్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ , హాస్పిటల్స్ లో ఓపీ సర్వీసులను ఓపెన్ చేస్తామని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారు ఆఫీస్ కు వెళ్లి పనిచేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఫిజికల్ డిస్టెన్స్ ను కచ్చితంగా మెయింటెన్ చేయాలని సూచించారు. జులై నాటికి కేసుల సంఖ్య అదుపులో ఉంటే బహిరంగ ప్రదేశాల్లోనూ సడలింపులు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికీ వారే మాస్క్ లు ధరిస్తూ సెల్ఫ్ ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. స్టే ఎట్ హోం అనే నినాదం తో పాటు స్టే సేప్టీ అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. కరోనా కు వ్యాక్సిన్ వచ్చే వరకు ఆంక్షలు తప్పవని చెప్పారు.