జకార్తా: సింగపూర్ ఓపెన్ గెలిచి ఫామ్‌లో ఉన్న భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో వరుసగా రెండో టైటిల్‌పై కన్నేసింది. టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్ 1 జంట, తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన కాంగ్ ఖాయ్ క్సింగ్, ఆరోన్ తాయ్ జోడీతో తలపడనుంది.
భారత్‌కే చెందిన మరో పురుషుల డబుల్స్ జోడీ ఎంఆర్ అర్జున్,హరిహరన్ అంసకరుణన్ కూడా తొలి రౌండ్ గెలిస్తే రెండో రౌండ్‌లో సాత్విక్- చిరాగ్ జంటతోనే తలపడాల్సి ఉంటుంది. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు థాయిలాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్‌బామ్రుంగ్‌ఫాన్‌తో తలపడనుంది.
