
హైదరాబాద్ మీర్ పేట్ లోని RN రెడ్డి నగర్లో TRS కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. దాడిలో ఐదుగురు కార్పొరేటర్లకు గాయాలయ్యాయి. 10వ వార్డు కార్పొరేటర్ ముద్ద పవన్ కుమార్ అతని అనుచరులు కలిసి మీర్పేట్ మేయర్ భర్త, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, మరో పదిమంది కార్పొరేటర్లపై దాడి చేశారు. హాకీ బ్యాట్లతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఐదుగురు కార్పొరేటర్లు గాయపడ్డారు. TRS పాలకవర్గ మీటింగ్ లో గొడవ జరిగింది. దాడిపై డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు మీర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. జనరల్ బాడీకి సంబంధించిన డబ్బుల కేటాయింపుపై చర్చిస్తుండగా..... పెండింగ్ బిల్లు విషయమై ముద్ద పవన్ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మీటింగ్ గురించి తనకు సమాచారం ఇవ్వలేదని... డబ్బులు కేటాయిస్తారా లేరా అంటూ ఫోన్లో మాట్లాడిన పదినిమిషాలకే కార్పొరేటర్ ముద్ద పవన్ అనుచరులతో వచ్చి దాడి చేశారని స్థానిక కార్పొరేటర్లు చెబుతున్నారు. మరోవైపు మీర్పేట్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. నిన్నటి గొడవతో మీటింగ్ కు బంధోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.