బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో టీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదం

బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో టీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉదయం భేటీ ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎంఐఎం, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వివాదం నెలకొంది. బడ్జెట్ పూర్తిగా ఇల్లీగల్ అంటూ ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు  నినాదాలు చేశారు టీఆర్ఎస్. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేయర్ రెండు పార్టీల నేతలకు సర్థి చెప్పినా... వినిపించుకోకపోవటంతో టీ బ్రేక్ ఇచ్చారు. 

బ్రేక్ తర్వాత ప్రారంభమైనా... జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి మార్పులేదు. బీజేపీ కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు మధ్య మళ్లీ వివాదం మొదలైంది. జీహెచ్ఎంసీని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా జీహెచ్ఎంసీకి రావటం లేదని ఆరోపించారు. దీంతో కౌన్సిల్ భేటీని మేయర్ మరోసారి వాయిదా వేశారు.

మరిన్ని వార్తల కోసం:

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలె