పార్టనర్​తో గొడవా? లైట్​ తీసుకోవద్దు

పార్టనర్​తో గొడవా? లైట్​ తీసుకోవద్దు

భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు, మాట పట్టింపులు సహజమే. కానీ, వాటిని పూర్తిగా లైట్​ తీసుకోవడానికి లేదు. అవే కొన్నిసార్లు పార్ట్​నర్స్​ మధ్య దూరానికి కారణమవుతాయి. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్​లో రిలేషన్​కి బ్రేక్​ వేయాల్సిందేనా? అంటే అస్సలు లేదంటున్నారు ఎక్స్​పర్ట్స్. హెల్దీ రిలేషన్​కి కొన్ని టిప్స్​ కూడా చెప్తున్నారు.

  పార్ట్​నర్​ దూరం పెడుతుంటే వాదనకి దిగకూడదు. అందుకు కారణాల్ని వెతకాలి. అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్లతో ప్రవర్తిస్తున్న తీరుని కూడా ఒకసారి చూసుకోవాలి. 
  ఎంత స్ట్రాంగ్​ రిలేషన్​ అయినా స్వేచ్ఛ లేకపోతే ఎక్కువ కాలం నిలబడదు. అందుకే పార్టనర్​కి రిలేషన్​లో కాస్త స్పేస్​ ఇవ్వాలి. దానివల్ల మనస్పర్థలకి చోటు ఉండదు. అలాగే గొడవైనప్పుడు పట్టింపులకి పోకుండా తప్పుంటే  సారీ చెప్పాలి.  అప్పుడే రిలేషన్​ బలపడుతుంది. ఒకవేళ ఎదుటివాళ్లు సారీని వెంటనే యాక్సెప్ట్ చెయ్యకపోతే  తగినంత టైం ఇవ్వాలి. 
  పార్ట్​నర్​ డైలీ రొటీన్​ని  కూడా గమనించాలి. ఒకవేళ పని ఒత్తిడి వల్లో లేదా ఇంకేదైనా పని వల్ల మనకి టైం ఇవ్వలేకపోతే  అర్థం చేసుకోవాలి. లేదా మరేదైనా కారణం వల్ల  దూరం పెడుతుంటే మాత్రం  వీలైనంత త్వరగా  మనస్పర్థల్ని దూరం చేసుకోవాలి .
  ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే  వాళ్లని ఎక్కడ  కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం ఉంటుంది. కొన్నిసార్లు ఆ భయమే  లేనిది ఉన్నట్లు చూపిస్తుంది. చిన్నచిన్న విషయాల్ని కూడా పెద్దదిగా చూపెడుతుంది. అందుకే అసలు నిజంగానే పార్ట్​నర్​ దూరం పెడుతున్నారా?  లేదా అనేది కూడా చూసుకోవాలి.