
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి టీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. బీబీనగర్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి.... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. 2014లో యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్ఎస్ లో మొట్టమొదట చేరింది తానేనన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. అయితే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉండగా.... తాను పోటీ చేస్తానని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.
For More News..