ప్రభాకర్ రావు లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏంచేద్దాం?

ప్రభాకర్ రావు లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏంచేద్దాం?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావు రాసిన లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇన్వెస్టిగేషన్​ఆఫీసర్లలో అయోమయం నెలకొంది. తాను ఇప్పట్లో భారత్​కు రాలేనని, అవసరమైతే ఈ–మెయిల్​/టెలీ కాన్ఫరెన్స్​ద్వారా విచారణకు హాజరవుతానని ఇటీవల దర్యాప్తు అధికారులకు ప్రభాకర్​రావు మెయిల్​ పంపారు. మరోవైపు ప్రభాకర్​రావుతో పాటు టాస్క్​ఫోర్స్​మాజీ డీసీపీ రాధాకిషన్​రావును విచారించేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతించింది. కానీ, ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు ఇప్పట్లో భారత్​కు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మల్లగుల్లాలు పడ్తున్నారు. గత నెల 23న, తాజాగా ప్రభాకర్ రావు రాసిన లెటర్లలో క్యాన్సర్​ ట్రీట్​మెంట్​కు సంబంధించి ఎలాంటి  ఆధారాలు జత చేయలేదు. 

దీంతో ఆ లెటర్లను  పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సంశమయంలో అధికారులు పడ్డారు. మరోవైపు  వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రభాకర్​రావును ప్రశ్నించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఫోన్​ట్యాపింగ్​ తీవ్రమైన నేరం కావడంతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా విచారించే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో విచారణకు కోర్టు అనుమతి తప్పనిసరిగా మారింది. ఈ మేరకు దర్యాప్తునకు అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో మెమో లేదంటే పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.