సత్తుపల్లి, వెలుగు : తండ్రి డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించిన కూతుళ్లను పలువురు అభినందించారు. స్థానిక జలగం నగర్ కు చెందిన సత్తెనపల్లి వీరభద్రాచారి మంగళవారం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయన భార్య శేషు కుమారి, కుమార్తెలు అరుణ కుమారి, సుశీల,సుగుణ తండ్రి కోరిక మేరకు అతడి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు.
మెడికల్స్టూడెంట్స్కు ప్రయోజనం చేకూరి, సమాజానికి ఉపయోగపడుతుందని బతికున్నప్పుడు వీరభద్రాచారి చెపుతుండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారిని ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎనాటమీ డిపార్ట్మెంట్ హెడ్ దాసరి చంద్రప్రియ, డాక్టర్అశోక్, లయన్స్ క్లబ్, ఖమ్మం నేత్ర నిధి బృందం హనుమంత రావు, నాగేశ్వర రావు, హరి ప్రసాద్, ప్రవీణ్, నాగేశ్వర రావు పలువురు ప్రముఖులు అభినందించారు.