టీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

టీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ లో జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లో ఆస్టేలియాపై ఘన విజయం సాధించి 21వ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో  భారత్ ఘన విజయం సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఉత్కంఠభరితంగా సాగిన ఆటలో క్రీడా స్పూర్తిని ప్రదర్శించి క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా మ్యాచ్ ను నిర్వహించిన క్రీడా శాఖ, పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.