
సిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. అల్మాస్ పూర్ బాలిక అత్యాచారం ఘటనలో మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో టీఆర్ఎస్ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. డబ్బు బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు . బాధితురాలి కుటుంబానికి 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.