
బెంగళూరు : కర్నాటకలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు 'ప్రజాధ్వని' పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బుధవారం నుంచి ఈ యాత్ర చేపట్టనున్నారు. మొత్తం 21 జిల్లాల్లో ఈ యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఈ ఇద్దరు నేతలు ఈ నెల 29 వరకు ఒకే బస్సులో ప్రయాణిస్తారు.
ఆపై ఫిబ్రవరి రెండో వారంలో 2 టీంలుగా విడిపోయి యాత్ర నిర్వహిస్తారు. సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని ఒక బృందం ఉత్తర కర్నాటక ప్రాంతంలో, శివకుమార్ దక్షిణ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. 1924లో గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం జరిగిన బెళగావి నుంచి యాత్ర మొదలుపెడతామన్నారు.