బీఆర్ఎస్ పాలనను అంతం చేయాలి: శ్యామ్ నాయక్

బీఆర్ఎస్  పాలనను అంతం చేయాలి: శ్యామ్ నాయక్

ఆసిఫాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యామ్ నాయక్ అన్నారు. శనివారం రెబ్బెన మండలంలో ప్రచారం నిర్వహించారు.  ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు. 

ఎన్ని కుట్రలు చేసినా ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.