బీఆర్ఎస్​ నాయకులను నిలదీయండి : భూపతిరెడ్డి

బీఆర్ఎస్​ నాయకులను నిలదీయండి : భూపతిరెడ్డి

నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, బూటకపు వాగ్దానాలతో గ్రామాల్లో తిరుగుతున్న  బీఆర్ఎస్​ లీడర్లను ప్రజలు నిలదీయాలని మాజీ ఎమ్మెల్సీ, రూరల్ ​కాంగ్రెస్​అభ్యర్థి భూపతిరెడ్డి కోరారు. శనివారం మోపాల్​ మండలంలో భారీ ర్యాలీతో  ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్​శ్రేణులు నర్సింగ్​పల్లి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సెంటిమెంట్​తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ నాయకులు గడిచిన తొమ్మిదేండ్లలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లెక్కకు మించి హామీలవ్వడం, ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే వాటిని పక్కనబెట్టడం బీఆర్ఎస్​కు అలవాటయిందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమ కోసం పాటుపడే కాంగ్రెస్​ను ఆదరించి తనను గెలిపించాలన్నారు.