- టైఫ్రెమింగ్తో సమస్యలు పరిష్కారం
- జిల్లా ఎన్పీడీసీఎల్లో గణనీయ మార్పులు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో విద్యుత్సేవలు మరింత మెరుగయ్యాయి. సప్లయ్లోపాలు గుర్తించడానికి నయా టెక్నాలజీ వాడుతున్నారు. పొలం బాటతో రైతులకు వద్దకు వెళ్లడమే కాకుండా కస్టమర్ నుంచి ఆన్లైన్ ఫిర్యాదు రావడమే ఆలస్యం గడువు విధించి మరీ పరిష్కరిస్తున్నారు.
వారంలో 3 రోజులు రైతులతో..
జిల్లాలో మొత్తం 7,97,731 కరెంట్ కనెక్షన్లుఉండగా అందులో డొమెస్టిక్ 5,19,358, వ్యవసాయ బోర్ కనెక్షన్లు 1,79,739 ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇతర కేటగిరీ కనెక్షన్లు 98,634 ఉన్నాయి. 17 సర్కిళ్ల పరిధిలో మొత్తం 225 సబ్ స్టేషన్లుండగా నిత్యం ఎక్కడో చోట సప్లయ్ సమస్యలు ఉండేవి. వ్యవసాయానికి క్వాలిటీ విద్యుత్‌సరఫరా చేయడంలో గవర్నమెంట్ రాజీపడడంలేదు. ఆ విషయం గ్రహించిన ఇంజినీర్లు ప్లానింగ్‌తో వెళ్లడం రిజల్ట్ ఇస్తోంది.
ప్రతీ మంగళ, గురు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 వరకు పొలంబాట నిర్వహిస్తూ రైతుల వద్దకు వెళ్లడంతో గ్రౌండ్లో సమస్యలు తెలుస్తున్నాయి. ఇలా గడిచిన పది నెలల్లో 1,200 సమస్యలను పరిష్కరించారు. మిడిమిడి జ్ఞానంతో విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫారాలు ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు విస్తృత ప్రచారం చేయడంతో జనవరి నుంచి ఇప్పటివరకు 1,246 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిని పరిష్కరించి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం విశేషం.
పిడుగుల ప్రొటెక్షన్‌కు లైట్నింగ్ అరెస్ట్‌లు
వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో పాటు ట్రాన్స్ఫారాలపై పిడుగులు పడ్డప్పుడు రోజుల తరబడి బ్రేక్‌డౌన్ ఉండేది. దానిని నివారించడానికి 127 లోకేషన్స్‌లో లైట్నింగ్ అరెస్ట్ పరికరాలు ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫారంపై పడడానికి వస్తున్న పిడుగును ఈ పరికరం పక్కకు డైవర్ట్ చేస్తుంది. సప్లయ్ లోపాన్ని గుర్తించడానికి 978 ఫీడర్స్కు యూనిక్ పోల్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సప్లయ్ సమస్య గుర్తించడానికి ఫీల్డ్‌లో రోజుల కొద్దీ తిరిగే విధానానికి స్వస్తి చెబుతూ ప్రాబ్లం ఉన్న లొకేషన్‌ను ట్రాక్ చేసే సిస్టంను తెచ్చారు.
కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి ఈ-స్టోర్ నుంచి మెటీరియల్ డ్రా చేయడం పారదర్శకతను పెంచి అక్రమాలకు కళ్లెం వేస్తోంది. పరిశ్రమల కనెక్షన్ల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంతో దరఖాస్తుదారులు ఫీజిబిలిటీని ఎస్ఎంఎస్ రూపంలో తెలుసుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న జిల్లాలో ఎమర్జెన్సీ రెస్టోరేషన్ టీంను ఏర్పాటు చేశారు. కరెంట్ సప్లయ్ సమస్య ఎక్కడ తలెత్తినా నిమిషాల్లో వాలిపోయేలా 14 వెహికల్స్‌తో స్టాఫ్‌ను రెడీగా పెట్టారు. 1912 టోల్‌ఫ్రీ నంబర్ ఫిర్యాదులను ఈ టీం అటెండ్ చేస్తుంది. వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ పెట్టారు.
లోపాలు లేని సేవలు లక్ష్యం
అన్ని రంగాలకు క్వాలిటీ కరెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలున్నాయి. దాని ప్రకారమే పనిచేస్తున్నం. తమ ప్రపోజల్స్‌కు తక్షణ శాంక్షన్స్ లభించడంతో ఉత్సాహం పెరుగుతున్నది. ఇంజినీర్లు ఇస్తున్న కొత్త ప్లానింగ్ అమలు చేయడంతో అద్భుత ఫలితాలు చూస్తున్నం.- రాజేశ్వర్‌రావు, ఎస్ఈ, నిజామాబాద్
