
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పై 39 వేల 430 ఓట్ల భారీ మెజార్టీతో జీవన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే జీవన్ రెడ్డి విజయం సాధించారు. జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా 56 వేల 698 ఓట్లు వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డికి డిక్లరేషన్ సర్టిఫికేట్ అందించారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్.
కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో తెల్లవారుజూమున తుది ఫలితం వచ్చింది.