రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  •     డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
  •     ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ఉట్నూర్/ఆదిలాబాద్​టౌన్/చెన్నూరు/బెల్లంపల్లి/కోటపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్​శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూర్​మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రోళ్ల పాలనలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాత్ర కీలకమైందన్నారు. 

యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుందన్నారు. ప్రతి పక్షనేత రాహుల్ గాంధీను ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్  తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్​లోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్​జాదవ్ ఆధ్వర్యంలో నాయకులు వేడుకలు నిర్వహించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్​ఫొటోలకు నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ ​అని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. పలువురు నేతలు పాల్గొన్నారు. 

రామకృష్ణాపూర్, మందమర్రి, చెన్నూరు, కోటపల్లిలోని నిర్వహించిన వేడుకల్లో మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి, కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు పోరాడిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకవచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.