న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మౌనంగా ఉంటే ఏమీ సాధించలేరని, ప్రధాని ఇప్పుడు పరీక్షా లీక్స్ పే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ దారుణం వల్ల తీవ్ర మానసిక ఆవేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మోదీ పాలనలో 90కి పైగా పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, 9 కోట్ల మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. బీజేపీ అండదండలతోనే పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని విమర్శించారు.
