నల్లగొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లి, కూతురిని నరికి చంపిన దుండగులు

నల్లగొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లి, కూతురిని నరికి చంపిన దుండగులు

నల్లగొండ జిల్లాలో దారణ ఘటన జరిగింది. కంట్లో కారం చల్లి తల్లీ కూతుర్లను నరికి చంపిన ఘటన కలకలం రేపింది. 2026 మే 17న  అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో జరిగిన ఈ  దారుణ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు రుద్రాక్ష సుమలత, రుద్రాక్ష లావణ్యగా గుర్తించారు.  భూతగాదాల కారణంగానే ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

చెట్టుకింద దగ్గర పడిఉన్న మృతదేహాలను ఊరంతా కన్నీరు పెట్టుకున్న పరిస్తితి. ఇద్దరిని కోల్పోయిన కుటుంబ సభ్యులు బోరుమని గుండెలు బాదుకుంటూ విలపించారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.