కోల్ ఇండియాలో 660 పోస్టులతో కొలువుల జాతర : బీటెక్, డిగ్రీ చేసినోళ్లకు సువర్ణావకాశం!

 కోల్ ఇండియాలో  660 పోస్టులతో కొలువుల జాతర : బీటెక్, డిగ్రీ చేసినోళ్లకు సువర్ణావకాశం!

కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్, బీఎస్సీ, బి.టెక్/ బీఈ, ఎంఏ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: మేనేజ్​మెంట్ ట్రైనీ (ఎంటీ).

మొత్తం ఖాళీలు: 660. 

విభాగాల వారీగా ఖాళీలు:  సివిల్ 178, ఎలక్ట్రికల్ 221, మెకానికల్ 145, సిస్టమ్ (ఐటీ/ సీఎస్) 43, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (ఈ & టీ) 38, జియాలజీ 15, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 11, రాజభాష (హిందీ) 05, కంపెనీ సెక్రటరీ 19. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనవర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం బీఈ/ బి.టెక్, గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ/ ఎం.టెక్, ఎంఏ (హిందీ) పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: మే 12.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.118‌‌0. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: జూన్ 11. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ coalindia.inను సందర్శించండి.

ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్/ రీజనింగ్/ న్యూమరికల్ ఎబిలిటీ/ జనరల్ ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, సంబంధిత సబ్జెక్టులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు 100  మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు.