ఈ వీకెండ్ కోసం నిన్న మే15న ఒక్కరోజే 20కి పైగా కొత్త సినిమాలు ఓటీటీ దర్శనం ఇచ్చాయి. డిఫరెంట్ జానర్లలో వచ్చిన ఈ కొత్త సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. తమిళం, హిందీ భాషల నుంచి కూడా తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు కూడా ఆడియన్స్ కి బూస్ట్ ఇస్తున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న ఆ సినిమాలు ఏంటీ? తెలుగులో ఉన్న బెస్ట్ కంటెంట్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
ఇక థియేటర్ల విషయానికి వస్తే.. సూర్య నటించిన ‘కరుప్పు’ కూడా నిన్నే ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తుంది. అలాగే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘హరుడు’ వంటి చిత్రాలు కూడా వచ్చి వీకెండ్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా మారింది. ఇక ఆలస్యం ఎందుకు కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.
ALSO READ : 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా..
ఆహా
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు విలేజ్ థ్రిల్లర్ )- మే 15
నెట్‌ఫ్లిక్స్
ధురంధర్ 2 (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్)- మే 15
బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- మే 15
ది క్రాష్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ)- మే 15
ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్)- మే 15
జీ5
టిఘీ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా)- మే 15
కోలైసేవల్ (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్)- మే 15
అమెజాన్ ప్రైమ్
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ డ్రామా)- మే 15
ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- మే 15
ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా సిరీస్)- మే 15
డ్రైవర్స్ ఈద్ (ఇంగ్లీష్ మూవీ)- మే 15
జియో హాట్‌స్టార్
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- మే 15
డట్టన్ రాంచ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ సిరీస్)- మే 15
సన్ నెక్ట్స్
తెరచాప (తెలుగు రస్టిక్ క్రైమ్ యాక్షన్)- మే 15
కాళిదాస్ 2 (తమిళ క్రైమ్ మూవీ)- మే 12
అమెజాన్ MX ప్లేయర్
విమల్ ఖన్నా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- - మే 15
లయన్స్ గేట్ ప్లే
కోచర్ (అమెరికన్ ఫ్యాషన్ డ్రామా ఫిల్మ్)- - మే 15
మనోరమ మ్యాక్స్
కప్ (మలయాళ స్పోర్ట్స్ డ్రామా )- మే 15
హులు ఓటీటీ
రైవల్స్ సీజన్ 2 (బ్రిటీష్ పీరియడ్ కామెడీ సిరీస్)- మే 15
ముబీ ఓటీటీ
దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో (చిలియన్ డ్రామా)- మే 15
ప్రస్తుతం ప్రేక్షకులు థ్రిల్లర్, క్రైమ్, సస్పెన్స్ కథలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్‌లలో తెలుగు ఆడియన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నది తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2, ధురంధర్ 2, కాళిదాస్ 2, కర్తవ్య, బ్యాడ్ బాయ్ కార్తీక్, బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్, ది క్రాష్, ది వండర్‌ఫూల్స్ వంటి యాక్షన్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
