ఎస్బీఐని మోదీ సర్కార్ కవచంగా వాడుతున్నది : మల్లికార్జున ఖర్గే 

ఎస్బీఐని మోదీ సర్కార్ కవచంగా వాడుతున్నది : మల్లికార్జున ఖర్గే 

న్యూఢిల్లీ, వెలుగు: తన అక్రమ లావాదేవీలను దాచేందుకు మోదీ సర్కార్ ఎస్బీఐని కవచంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ తన ఖజానాను నింపేందుకు ఆర్‌‌‌‌బీఐ, ఎన్నికల సంఘం, పార్లమెంట్, ప్రతిపక్షాలు, అన్ని సంస్థలను తొక్కిపెడుతున్నదని మండిపడ్డారు. మంగళవారం ‘ఎక్స్’ వేదికగా కేంద్రంపై ఖర్గే విమర్శలు చేశారు. ఈ నెల 6 వరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఖర్గే గుర్తుచేశారు.

అయితే, జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని ఎస్బీఐ ఎందుకు కోరుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల దాతల డేటా ఎంట్రీలను కేవలం 24 గంటల్లో బహిర్గతం చేసి సరిపోల్చవచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారని తెలిపారు. కానీ ఎస్బీఐకి మాత్రం 4  నెలల గడువు ఎందుకు అవసరం? అని ఖర్గే ప్రశ్నించారు.