ఖలిస్తాన్ తీవ్రవాదులకు కాంగ్రెస్ సహకరించింది

V6 Velugu Posted on Jan 10, 2022

  • ప్లాన్ -సి ద్వారా మోడీ కాన్వాయ్ ను అడ్డుకోగలిగారు
  • దిల్ షుక్ నగర్ చైతన్యపురిలో బీజేపీ మౌనదీక్షను ప్రారంభించిన బండి సంజయ్

హైదరాబాద్: ఖలిస్తాన్ తీవ్ర వాదులకు కాంగ్రెస్ పార్టీ సహకరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే  ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయిని పంజాబ్ లో అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం దిల్ షుక్ నగర్ చైతన్యపురిలో బీజేపీ మౌనదీక్షను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన కు సంబందించి వివరాలను కేంద్ర ప్రభుత్వం పంజాబ్ డీజీపీ కి పంపించిందని, ప్లాన్ - ఏ.. ప్లాన్ -బీని లీక్ చేశారని ఆయన ఆరోపించారు. ఎందుకు లీక్ చేశారో దీని పైన విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్లాన్ -సి ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకోగల్గిందన్నారు. పాకిస్థాన్ బార్డర్  కు కేవలం 15 కిలోమీటర్లు దూరంలో మోడీ కాన్వాయ్ ని అడ్డుకున్నారని, దేశ ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకుంటే టిఆర్ఎస్ ఖండిచాల్సింది పోయి...రాజకీయ కోణంలో మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోతే అన్ని రకాలుగా భద్రత కల్పిస్తుందని బండి సంజయ్ తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

వర్క్​ ఫ్రమ్​ హోమ్..​ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే

 

 

Tagged Bjp, Bandi Sanjay, Hyderabad, COMMENTS, tour, state chief, visit, Mouna deeksha, Dilshuknagar

Latest Videos

Subscribe Now

More News