వర్క్​ ఫ్రమ్​ హోమ్..​ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే

వర్క్​ ఫ్రమ్​ హోమ్..​ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే
  • గర్భిణులు, దివ్యాంగ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​
  • గర్భిణిలు, దివ్యాంగ ఉద్యోగులకు ఇంట్లో నుంచే పని
  • కొత్త గైడ్​లైన్స్ రిలీజ్ చేసిన డీవోపీటీ

న్యూఢిల్లీ, వెలుగు: గర్భిణిలు, దివ్యాంగ ఉద్యోగులకు అటెండెన్స్​ నుంచి కేంద్రం మినహాయింపు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వాళ్లు ఆఫీసుకు రానక్కర్లేదని, ఇంట్లోనే ఉంటూ వర్క్​ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈమేరకు డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) మంత్రి జితేంద్రసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు కొత్త గైడ్ లైన్స్ ప్రకటించారు. జనవరి 31 వరకు ఈ గైడ్ లైన్స్ అమలులో ఉంటాయని తెలిపారు. కంటైన్‌‌మెంట్ జోన్‌‌ను డీ నోటిఫై చేసేంత వరకు ఆ జోన్‌‌లో నివసిస్తున్న ఆఫీసర్లు, స్టాఫ్ కు కూడా వెసులుబాటు కల్పించారు. అయితే, ఆఫీసుకు రాని వారు, వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న వారంతా కచ్చితంగా ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. అండర్ సెక్రటరీ లెవల్ కంటే తక్కువ స్థాయి ఎంప్లాయిస్ 50% మాత్రమే ఆఫీసుకు అటెండ్ కావాలని, మిగిలిన 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోంలో ఉండాలన్నారు. ఇందుకు తగ్గట్లుగా సంబంధిత అన్ని శాఖలతో రోస్టర్‌‌ సిస్టమ్​ను రెడీ చేస్తామని తెలిపారు. ఆఫీసులో రద్దీని నివారించడానికి వర్క్ టైమింగ్స్ లో మార్పులు చేశామని, అన్ని అఫీషియల్ మీటింగ్స్ ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని సూచించారు. కరోనా రూల్స్​ను తప్పక పాటించాలని 
మంత్రి జితేంద్ర సింగ్​ స్పష్టం చేశారు.