గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు

గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు

పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణ‌యం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో సమావేశ‌మైన పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీ రిజర్వేషన్‌పై కోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా మహిళలు, దళితులపై దాడులకు నిరసనగా నవంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయాలని తీర్మానం చేసింది. ఈనెల 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో ర్యాలీ, 12 జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ దీక్షలు. రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

గ్రేటర్ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము వివ‌రాల‌ను పీసీసీ అధ్యక్షులు ఉత్త‌మ్ తెలిపారు. జనరల్ సీట్లలో పోటీ చేసే వారికి రూ. 10 వేలు, రిజర్వేషన్‌ సీట్లలో నాన్ జనరల్ అభ్యర్థులకు రూ.5 వేలు గా తెలిపారు. దరఖాస్తు తోపాటు చెక్ రూపంలో రుసుము పార్టీకి ఇవ్వాలని చెప్పారు

సన్నరకం వడ్లకు రూ.2500 మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్ తో ఉద్యమం చేప‌డుతామ‌న్న ఉత్త‌మ్.. రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పలు అంశాల్లో ఉద్యమాలకు సంబంధించి సబ్ కమిటీ లు వేశామని.. వారికి అప్పగించిన పనులు సకాలంలో చేయాలని అన్నారు.