కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత బొల్లి స్వామికి లేదు : దళిత నాయకులు

కాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత బొల్లి స్వామికి లేదు : దళిత నాయకులు

ధర్మారం,వెలుగు: కాకా కుటుంబాన్ని విమర్శించే అర్హత బొల్లి స్వామికి లేదని ధర్మారానికి చెందిన కాంగ్రెస్ దళిత నాయకులు మండిపడ్డారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ పెట్టి బొల్లి స్వామి కామెంట్లను ఖండించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎదుల్ల అంజయ్య మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి 50 ఏళ్లకు పైగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు సేవ చేశారని, సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఉమ్మడి ప్రణాళికలో చేర్చడంలో కాకా కృషి మరువలేనిదని కొనియాడారు.

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా పెద్దపల్లి ఎంపీగా తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడారని గుర్తుచేశారు. కాకా ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారని చేస్తున్నారని, వారి సేవలను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించిందని స్పష్టం చేశారు.    నాయకులు గంధం మహిపాల్  ఓరేం చిరంజీవి, మెట్టుపల్లి నరేశ్, పొన్నవేని స్వామి, ఎనగంటి గంగన్న,  సత్యనారాయణ, ఎండి అష్షు, కంసాని ఎల్లయ్య, కుమార్, నంబమ్మ పాల్గొన్నారు.