రేపటి ధర్నాకు సర్పంచ్‭లు తరలిరావాలె: రేవంత్

రేపటి ధర్నాకు సర్పంచ్‭లు తరలిరావాలె: రేవంత్

రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనను సీఎం కేసీఆర్ పోలీసులతో అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే  హైకోర్టు అనుమతితో రేపు ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సర్పంచ్‭లు తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. సర్పంచుల హక్కుల కోసం నిరసనగళం వినిపిద్దామని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేద్దామని ట్వీట్ చేశారు. రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

మరోవైపు.. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ‘హాత్‌ సే హాత్‌ జోడో’లో భాగంగా పల్లె పల్లెకూ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో స్ఫూర్తిని తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రెండు నెలల పాటు అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టి.. రాహుల్‌ ప్రసంగాలను ప్రజలకు అందించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.