ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎలక్షన్ ​స్క్రీనింగ్ కమిటీలు

ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎలక్షన్ ​స్క్రీనింగ్ కమిటీలు
  • తెలంగాణ కమిటీ చైర్మన్​గా మురళీధరన్


న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఎన్నికలు జరగను న్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ హైకమాండ్​ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలను ప్రకటించింది. కాంగ్రెస్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీధరన్, సభ్యులుగా బాబా సిద్దిఖ్, జిగ్నేశ్ మేవానీని నియమించారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్, ఏఐసీసీ ఇన్​చార్జ్ సెక్రటరీలను నియమించారు.