ఖమ్మం రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి, బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులను భూభారతి ద్వారా పరిష్కిరిస్తున్నామని తెలిపారు. సాదాబైనామాలను వచ్చే 35 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సాదాబైనామా పేరుతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు 7 క్లస్టర్లలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో 10 వేల దరఖాస్తుల్లో 5 వేల అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని చెప్పారు. కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్లు పి శ్రీజ, పి శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
