తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసింది. ఈ సీజన్ లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 14 లక్షల మంది రైతులకు రూ.16 వేల 606 కోట్లు చెల్లించింది. రూ.1,425 కోట్ల బోనస్ ను వారి ఖాతాలో జమచేసింది. గత బీఆర్ఎస్ పాలన 2020-21 లో 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమించింది. ఇది రాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టం. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ట్విట్టర్లో వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి సాగైంది. సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూల్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోంది. గడిచిన రెండేండ్లలో తెలంగాణ దేశమందరి దృష్టిని ఆకర్షించేలా పంటల సాగులో కొత్త రికార్డులు నెల కొల్పింది.
రైతుల మేలుకోరే పథకాలు
తొలి రెండేండ్లలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రా ధాన్యమిచ్చింది. రైతుల మేలుకోరే పథకాలకు భారీ బడ్జెట్ కేటాయిం చింది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ. 54,280 కోట్లతో వివిధ పథకా లను అమలు చేసింది. దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను అదుకునేం దుకు ప్రభుత్వం వెనుకాడలేదు. గత ఏడాది మార్చి, సెప్టెంబర్లో వడగం డ్లు. వర్షాలతో నష్టపోయిన 94462 మంది రైతులకు రూ. 95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షా లకు నష్టపోయిన 36449 మంది రైతులకు రూ.44,19కోట్ల పరిహారం అందించింది.
.
