
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8, 9,10 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి కె.వెంకటాచారి తెలిపారు. సంబంధిత అధికారులు తప్పకుండా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మూడు రోజులు సెలవులను వినియోగించుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. తహసీల్దారులు, సూపరింటెండెంట్లు, సంబంధిత సిబ్బంది విధుల్లో ఉండాలని, మిగిలినవారు 8, 9, 10 తేదీల్లో సెలవులు వినియోగించుకోవచ్చని చెప్పారు.