ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  అద్దంకి, బల్మూరి వెంకట్

హైదరాబాద్: కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్,  ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అధినాయకత్వం మందు సామేల్ కు టికెట్ కేటాయించింది. దీంతో ఆయనకు ఎంపీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.

 కానీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు.  ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బల్మూరి వెంకట్ కు కూడా మరో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్య, టెన్త్ పేపర్ లీకేజీల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటాలు చేశారు. ఈ నెల 18వ తేదీవరకు నామినేషన్లకు గడువు ఉంది. 19న పరిశీలన, 22వ తేదీ వరకు ఉపసంహరణలకు గడువు ఉంది. 29న పోలింగ్ నిర్వహించి అదే  రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు  ప్రకటిస్తారు.