మహా సంక్షోభం..పార్లమెంట్ ఆవరణలో సోనియా నిరసన

మహా సంక్షోభం..పార్లమెంట్ ఆవరణలో సోనియా నిరసన

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్  ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ పలువురు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అటు పార్లమెంట్  లోపల కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.